ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కొందరు చిన్నారులు సోమవారం లేఖ రాశారు. తమ గ్రామంలోని పాఠశాలను తరలించకుండా చూడాలని అనంతపురం జిల్లా మాయదార్లపల్లి గ్రామ చిన్నారులు కోరారు. 6, 7, 8 తరగతులను మరో పాఠశాలలో విలీనం చేశారని వారు వాపోయారు. కర్ణాటక బోర్డర్లో ఉండే తమ గ్రామంలో బస్సు సౌకర్యం లేదని పేర్కొన్నారు. చదువు మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయని లేఖలో వారు ఆవేదన వ్యక్తం చేశారు.