పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజక వర్గ పరిధిలోని రొంపిచర్ల మండలంలో సుబ్బయ్యపాలెం గ్రామంలో సెప్టెంబర్ 16 దివంగత మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చదలవాడ అరవోను బాబు పాల్గొని కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరడం జరిగింది.దానిలో భాగంగా ఉదయం పోలీసులు వచ్చి అడ్డుకొని అనుమతి లేకుండా గ్రామంలో విగ్రహాలను ప్రతిష్దించటానికి వీలు లేదన్నారు.దీంతో పోలీసులకు, టీడీపీ నాయకులకు వాగ్వివాదం జరిగింది.
అనంతరం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ లోతేటి శివశంకర్ కు స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో వైసిపి నాయకుల ఆగడాలు మితి మీరిపోతున్నాయి.పల్నాడు అభివృద్ది ప్రదాత డా౹౹కోడెల శివప్రసాద రావు విగ్రహానికి ఆవిష్కరణ అడ్డుకోవడం దారుణం.టీడీపీ నాయకులు,కార్యకర్తల పై దాడులు పెరిగిపోతున్నాయి.అలవాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెన్నా బాలకోటిరెడ్డి పై దాడి జరిగి రెండు నెలల కావస్తున్న పోలీసులు నిందితులను పట్టుకోలేదు. తమ పార్టీ నాయకులు,కార్యకర్తల పై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోం.రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా చెల్లిస్తాం అని హెచ్చరించారు.