నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ నీలంపేటలో సోమవారం పర్యటించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి సంక్షేమ పథకాలు అమలుపై ఆరా తీశారు.
అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు .అలాగే సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.