అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని ఉత్తర నియోజకవర్గ సమన్వయ కార్యకర్త రాష్ట్ర నెడ్క్యాప్ చైర్మన్ కే. కే రాజు అన్నారు. ఈ సందర్భంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వార్డు జై భారత్ నగర్ సచివాలయం పరిధి 1086276 జై భారత్ నగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వివరించారు.
కె. కె రాజు మాట్లాడుతూ. ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా ప్రజా ప్రతినిధులు తెలుసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని తద్వారా ఆయా సమస్యలను పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి. సతీష్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు. శంకరరావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు డైరెక్టర్లు ఆళ్ల శివగణేష్ కె. పి రత్నాకర్ రాయుడు శ్రీను 48వార్డు నాయకులు కర్రి. రామారెడ్డి రుత్తల. రాంబాబు పి. పద్మా పి. అప్పారావు నరేష్ హేమంత్ జయ భరత్ సీనియర్ నాయకులు షేఖ్ బాబ్జి చిరంజీవి వసంతల అప్పారావు హరిపట్నాయక్ కె. చిన్నా సునీల్ రాఘవులు పావని చందురెడ్డి సచివాలయం సిబ్బంది వాలంటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.