ఒంట్లో నీటి శాతం తగ్గినా తలనొప్పి వస్తుందట. అందుకే కొబ్బరినీళ్లు లేదా గ్లూకోజ్ కలిపిన నీళ్లు తాగాలి. రోజులో కనీసం 7గంటలు నిద్రపోవాలి. కళ్లు మూసుకొని కనుగుడ్లను గుండ్రంగా క్లాక్, యాంటీ క్లాక్ పద్ధతిలో తిప్పి, తర్వాత రెండింటిని ఒక దగ్గరికి తీసుకురావడం, నలుమూలలకీ తీసుకెళ్లడం లాంటి వ్యాయామాలు చేయాలి. బియ్యాన్ని వస్త్రంలో చుట్టి వేడి చేసి కాపడంలా పెట్టుకోవాలి. అల్లం టీ తాగాలి.