అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో గల కళ్యాణ్ లోవా జలాశయ పరివాహ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా టూరిజం ప్రాథమిక అభివృద్ధి చేయాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గల్లా రాజేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం అనకాపల్లి జిల్లా బిజెపి కార్యాలయ భవన్ శంకుస్థాపనకు విచ్చేసిన ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ గిరిజన ప్రాంత కళ్యాణుపులోవ రిజర్వాయర్ యొక్క పరివాహక ప్రాంతం 1971లో 460 అడుగుల నీటిమట్టం ఉండి 4484 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం గల ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైన రిజర్వ్ అడవి ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం ఎవరూ కూడా అభివృద్ధి చేయకపోవడం వలన నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ పోతురాజు బాబు తిరణాలు ప్రతి ఏ ఆట అంగరంగ వైభవంగా హిందూ సాంస్కృతి సాంప్రదాయాల నడుమ గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుము జరుగుతున్న కనీసం ఇక్కడ భక్తులు ఉండడానికి కానీ వారు వచ్చిన వారికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉంది. ఈ ప్రాంతం పూర్తిగా టూరిజం సంబంధించి పర్యావరణ పరంగా వెనుకబడి ఉంది. కాబట్టి ఈ ప్రాంతం దృష్టి సారించి అభివృద్ధికి తగిన కృషి చేయాలని కోరారు.
శ్రీ కళ్యాణ పోతురాజు బాబు తిరణాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే శ్రీ కళ్యాణ పోతురాజు బాబు పెద్దింటి అమ్మల ఉత్సవాలు ప్రతి ఏటా శివరాత్రి వారం రోజులు పాటు నిర్వహిస్తారు. లక్షలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు.
అయితే వచ్చిన వారికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్కు ఎడమవైపున దేవుడు కొండ కుడివైపున సామలమ్మ పర్వతాలు ఉన్నాయి ఈ పర్వతాలు ఎకో టూరిజానికి అనువైనవి వీటిపై దృష్టి పెట్టి టూరిజం గా అభివృద్ధి అవ్వడం వల్ల ఇక్కడ గిరిజనులకు ఉపాధి కలుగుతుంది ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కాబట్టి టూరిజంఅభివృద్ధి కేంద్ర మంత్రికి విద్య చేశారు. సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి పరిశీలిస్తామని చెప్పారు.