వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులమత పార్టీలకతీతంగా అందజేస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించి,అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా పధకం అందకపోతే సంబంధిత సచివాలయ సిబ్బందితో అప్డేట్ చేపించి వారికి ఆ పథకం అందేలా చేయడమే లక్ష్యంగా సాగుతుంది అని దేవినేని అవినాష్ తెలియజేసారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం,తాటిపర్తి కొండారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ స్థానిక 109 సచివాలయ పరిధిలోని ఓల్డ్ పోస్ట్ ఆఫీస్,కోత మిషన్ రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం ద్వారా వారికి అందుతున్న సంక్షేమ లబ్ది గురుంచి వివరించడం జరిగింది.