బీహార్ సీఎం నితీష్ కుమార్ తన కేబినెట్ లోని ఓ ముస్లిం మంత్రిని హిందూ ఆలయానికి తీసుకువెళ్లి దుమారం రేపారు. పైగా హిందువులు కానివారికి ఆ ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. గయలోని విష్ణుపాద్ గుడికి నితీష్ తన కేబినెట్ ముస్లిం మంత్రి మహమ్మద్ ఇజ్రాయెల్ మన్సూరీని వెంటబెట్టుకుని వెళ్లారు.ఆ మంత్రి ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అప్పుడే రచ్చ మొదలైంది. నితీష్ తీరుపై బీజేపీ విరుచుకుపడింది.