వరుసగా పండుగలు రానున్న తరుణంలో సామాన్యుడికి షాక్ తగలనుంది. వారం వ్యవధిలో గోధుమల ధరలు 4 శాతం పెరిగాయి. గోధుమల ఉత్పత్తి తగ్గడంలో మే నెలలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమల ఎగుమతులను నిలిపి వేసింది. అయితే ధరలు తగ్గాల్సింది పోయి పెరగడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. డిమాండ్ పెరగడంతోనే ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.