గ్రేటర్ విశాఖ 62 వార్డులో దుర్గా నగర్ లో ఇంటి పన్ను చట్టం ముడిపెట్టడం వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. జీవీఎంసీ వైసీపీ పాలకవర్గం ప్రజలకు చేసిన ద్రోహాన్ని వివరిస్తూ కరపత్రం ఇంటింటికీ పంచారు. ఈ పాదయాత్రను ఉద్దేశించి సిపిఎం పార్టీ మల్కాపురం జోన్ కార్యదర్శి పి పైడ్రాజు మాట్లాడుతూ.. ప్రజలు చెత్త పన్ను కట్టకపోవడంతో ఇంటి పన్ను అర్ధ సంవత్సరం పనులు బట్టి ప్రతినెల చెత్త పనులు పెట్టాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు.
ఆరు నెలలకు రెండు వందల రూపాయల పన్ను కట్టిన వారు రూ.20 కట్టాలని, రూ.200 నుంచి వెయ్యి రూపాయల వరకు ఇంటి పన్ను ఉన్న వాళ్ళు రూ.50 కట్టాలని, 1001 నుంచి 2000 వరకు ఉన్న ఇంటి పన్ను రూ.60 కట్టాలని 2001 నుంచి 4000 ఉన్న ఇంటి పన్ను కట్టిన వాళ్ళు రూ.110 రూపాయలు కట్టాలని 4000 పైపులు వారంతా కూడా 120 రూపాయలు చెత్త పన్ను కట్టాలని జీవీఎంసీ కౌన్సిల్ లో వైసిపి కార్పొరేటర్లు అందరు కూడా తీర్మానం ఆమోదించడం జరిగింది.
ఈ కొత్త పన్ను విధానాన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కావున ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని పాదయాత్రలో ప్రజలకు పిలుపునిచ్చారు. చట్ట పని వేయడమే చట్టానికి విరుద్ధమని ఇది కాకుండా అదనంగా ఈ రకమైన విధానం మరియు దుర్మార్గాన్ని తక్షణమే విధానాన్ని రద్దు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి అర్జునరావు, ఆనంద్, సంతోషం, జి రాము, సురేష్ తదితరులు పాల్గొన్నారు.