ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో సక్సెస్ అయిన నారా, నాదెండ్ల ఇద్దరూ పవన్ కల్యాణ్ అనే శిఖండిని కలుపుకొని ప్రజలకు ఆప్తుడైన సీఎం వైయస్ జగన్ మీద కుట్రలు పన్నుతున్నారని, పవన్, నారా, నాదెండ్ల లాంటివారు మరో 300 మంది వచ్చినా వైయస్ జగన్‌ను ఏమీ చేయలేరని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.
పవన్ కల్యాణ్ గుండు ఎపిసోడ్‌లోనే చిరంజీవికి పెద్ద అవమానం జరిగిందని, మళ్లీ ఆయన పుట్టినరోజున పవన్ కల్యాణ్ తన సొంత ఎజెండాతో అవమానించాడన్నారు. కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకునే పవన్..... చిరంజీవి తమ్ముడిని అని ఎప్పుడైనా చెప్పుకున్నాడా..? అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే ధైర్యం పవన్‌కు ఉందా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి దాడిశెట్టి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు.