కర్ణాటక వ్యాప్తంగా అతికించిన వీర్ సావర్కర్ పోస్టర్లను టచ్ చేస్తే.. వారి చేతులు నరికేస్తామని హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ హెచ్చరించారు. హిందూత్వ ఐడియాలజీకి చెందిన వీర్ సావర్కర్ పోస్టర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తే హిందూసేన కార్యకర్తలు వారి చేతులు నరికి పడేస్తారని ముథాలిక్ పేర్కొన్నారు.
వీర్ సావర్కర్ ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఆయన బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. ముస్లింలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వీర్ సావర్కర్ పోస్టర్లను తాకితే వారి చేతులు నరికేస్తామని తేల్చిచెప్పారు. ఇది మా హెచ్చరిక అని పేర్కొన్నారు. దేశం కోసం సావర్కర్ చిత్తశుద్ధితో 23 ఏండ్ల పాటు పోరాటం చేశారని ముథాలిక్ గుర్తు చేశారు.