రమ్మీ వంటి ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించేందుకు చట్ట సవరణ పరిశీలనలో ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం తెలిపారు.ఆన్‌లైన్ గేమ్‌ను నిషేధించాలన్న ప్రభుత్వ చర్యపై కేరళ హైకోర్టు గతంలో స్టే విధించింది.ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా లక్షల్లో డబ్బు పోగొట్టుకుని చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారని సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో అన్నారు."ఆన్‌లైన్ రమ్మీని నిషేధించడానికి కేరళ గేమింగ్ యాక్ట్ 1960 ఫిబ్రవరి 2021లో సవరించబడింది. అయితే గేమింగ్ కంపెనీలు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లపై కేరళ హైకోర్టు ఆ సవరణను రద్దు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది." అని సీఎం పినరయి విజయన్ తెలిపారు.ఆన్‌లైన్ గేమింగ్ సమస్యలపై పోలీసు శాఖతో పాటు వివిధ శాఖలు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.