విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలానికి చెందిన దంపతులకు మూడు రోజుల కిందట వివాహమైంది. మంగళవారం ఉదయం మార్కెట్ కోసం భార్యా భర్తలిద్దరూ విజయనగరం వచ్చారు. ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసరికి వ్యక్తిగత పనిపై భర్తను తిరిగి పంపించిన యువతి అతను వచ్చేసరికి కనిపించలేదు. సొంత మేనకోడలే అని, వయసు 20 ఏళ్లు ఉంటుందని ఆమె భర్త ఒకటో పట్టణ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నట్లు పోలీసులు తెలిపారు.