కాకినాడ జిల్లా ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో ఉద్యోగ నిర్వహణ చేస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన శ్రీ బి.రాజ్ కుమార్ (ARHC-3071) చీఫ్ ఆఫీస్ నుండి రాబడిన Rs.8,00,000/-ల చెక్కును వారి సతీమణి శ్రీమతి బి.విజయ దుర్గ గారికి కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీస్ శాఖలో ఎక్కడ పని చేసిన పోలీస్ వారంతా కుటుంబ సభ్యుల్లాగా కలిసి మెలిసి ఉంటాము అలానే ఎవరికీ కష్టం వచ్చిన అండగా అధికారులు తో పాటు సహా ఉద్యోగులు కూడా ఉంటారని తెలియజేసారు.