ఈ రోజు అనగా 24.08.2022 వ తేది నాడు ఏలూరు ఆశ్రం హాస్పిటల్ వద్ద గల నేషనల్ హైవే పై ఏలూరు జిల్లా పరిధిలో 2021 నుండి 2022 వరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు కాబడిన సారా కేసులలో 8270 లీటర్ల నాటు సారాను అధికారుల యొక్క సమక్షంలో ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు యొక్క ఆదేశాలపై జిల్లాలో వివిధ ఇతర ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాలకు హానికలిగించే నాటు సారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపామని, ఎక్కువ కేసులలో ఉన్న 07 మంది ముద్దాయి లపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇంకా 03 పి.డి యాక్ట్ నమోదు చేస్తున్నట్లు, పచ్చని గ్రామాలలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నాటుసారా తయారీ కేంద్రాల యొక్క సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేసి పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు అందరూ సహకరించాలని ఎవరైనా నాటుసారా తయారీ కేంద్రాలు మరియు విక్రయదారుల యొక్క సమాచారాన్ని తెలియ చేసిన యెడల వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, సమాచారం తెలియజేయవలసిన ఫోన్ నెంబర్ల డయల్ 100, 955035110, 8332959175 కు తెలియచేయాలని తెలియ చేసినారు.