చంద్రగిరి మండల తెలుగు యువత అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్ లు రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త విని దిగ్బ్రాంతికి గురైనట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన, నిబద్ధత గల నాయకులు ఇలా కనుమరుగు కావడం విచారకరం. భానుప్రకాష్, భాస్కర్ ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఐ-టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ సోమశేఖర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.