ఏపీ సీఎం జగన్ గురువారం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం డబ్బుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఏటా రూ.24 వేల నగదు సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. గురువారం నాల్గవ విడత నేతన్న నేస్తం నగదును సీఎం జగన్ నేతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి రూ.72 వేల సాయం అందింది.