ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బుధవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఖాళీగా ఉన్న అంగన్ వాడీ సూపర్ వైజర్లు, అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. నాడు-నేడు పూర్తి చేసుకున్న పాఠశాలల్లో వాచ్‌మెన్‌ను నియమించాలని, పాఠశాలల నిర్వహణకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.