పాకిస్థాన్ నుంచి జమ్మూ కశ్మీర్లోకి చొరబడాలన్న ఉగ్రవాదుల పన్నాగాన్ని భారత భద్రతా బలగాలు వమ్ముచేశాయి. యూరీ సెక్టార్లోని కమాల్ కోటే వద్ద ముగ్గురు చొరబాటుదారులను జవాన్లు కాల్చి చంపారు. సరిహద్దు నియంత్రణ రేఖకి సమీపంలో మదియాన్ నానక్ పోస్టు వద్ద ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భారత సైన్యం, కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. భారత బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి.