రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పాలన సాగిస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వేముల మండలంలోని చాగలేరు గ్రామంలో గురువారం పాడ ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల ఇన్చార్జ్ నాగేళ్ల సాంబ శివారెడ్డి, జడ్పిటిసి కోగటం వెంకట బయపురెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి, పిసిబి రాష్ట్ర డైరెక్టర్ మరక శివకృష్ణారెడ్డిలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా గ్రామంలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎంపీ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అమ్మఒడి , రైతు భరోసా, వైయస్సార్ ఆసరా , వైయస్సార్ చేయూత వంటి పథకాలు అందుతున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.