ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏటీఎం కార్డు మార్చి నగదు దోపిడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 11:26 AM

వైఎస్ఆర్ కడప: రైల్వే కోడూరు పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కార్డు మార్చి నగదు దోపిడి చేసినట్లు రైల్వే కోడూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హేమాద్రి తెలిపారు. మారం రెడ్డి లక్ష్మీదేవి ఏటీఎం వద్ద డబ్బులు తీసుకుంటుండగా తాను తీసిస్తానని గుర్తుతీయని వ్యక్తి ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు రావడం లేదని చెప్పి కార్డు మార్చి వేశారు. తరువాత గుర్తుతెలియని వ్యక్తి 50, 746 రూపాయలు డ్రా చేశాడని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com