గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా బీచ్ క్లీనింగ్ డ్రైవ్ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ కోసం ఏపీ ప్రభుత్వం పార్లే కంపెనీతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ జగన్ మోహన రెడ్డి గారికి విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శాసనసభ్యులు, జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ గౌరవప్రదంగా కలిసి పుష్పగుత్యం అందజేసి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.