ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. సీఎం మాటలు ఒకసారి పరిశీలిస్తే.. విమానాశ్రయం నుండి బీచ్ రోడ్డు వరకు నా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అందులో నేనే కనిపిస్తున్నాను అనేది ఒక విషయం. ఈ రోజు మనం ప్లాస్టిక్ పెక్సీలు ఏర్పాటు చేయడం తప్పు కదా అని కలెక్టర్ మల్లికార్జున్ ని అడగడం జరిగిందన్నారు.
ప్రజల్లో తప్పుడు మెసేజ్ ఇస్తున్నాం కదా అని కలెక్టర్నీ అడగగా కలెక్టర్ చెప్పిన సమాధానంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అవి క్లాత్ ఫ్లెక్సీలు సార్ ఈ ఫ్లెక్సీ తయారు చేయడానికి 32 రూపాయలు అవుతుందని అయినప్పటికీ ప్లాస్టిక్ రహిత విశాఖ నగరం గా తీర్చిదిద్దే దుకు ఈ క్లాత్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని కలెక్టర్ మల్లికార్జున తెలిపినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసి కలెక్టర్ మల్లికార్జున ని అభినందించానన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.