నెల్లూరు జిల్లా, ఆత్మకూరు: మండల కేంద్రమైన అనంతసాగరం చెరువు లోతట్టు మంచాలపల్లి వద్ద నీటి మడుగులో గురువారం గుర్తుతెలియని యువకుడు (35) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. ఒంటిపై ప్యాంటు మాత్రమే ఉంది. ఎలాంటి అధారాలు లేకపోవడంతో ఎలా మరణించాడు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆ వ్యక్తి ముందురోజు (బుధవారం) అనంతసాగరం బస్టాండ్ సెంటరులో మతిస్థిమితం కోల్పోయి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఎస్ఐ సంతోష్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.