నెల్లూరు, ఆత్మకూరు: పెన్నా డెల్టాకు సోమశిల జలాశయం నుంచి 13 10 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని విడుదల చేశారు. సోమశిల జలాశయంలో ప్రస్తుతం 69. 161టిఎంసిల నీటి మట్టం నమోదయింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం సోమశిల జలాశయం అధికారులు తాజా ప్రకటన విడుదల చేశారు. సోమశిల జలాశయంకు ఎగువ ప్రాంతాలనుంచి 13, 046 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. సోమశిల జలాశయం నుంచి కండలేరు కు 7940 క్యూసెకులు, ఉత్తర కాలువకు 3 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 300 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు.