అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం లో శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆఖరి శ్రావణ శుక్రవారం అవడంతో ఉదయం నుంచే అధికసంఖ్యలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు బారులు తీరి నిల్చున్నారు. ఎక్కువ మంది సామూహిక కుంకుమ పూజలు కోసం క్యూ కట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని చర్యలు తీసుకున్న ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మీనగేష్ ను పలువురు అభినందించారు.
ఉత్తరాంధ్ర ఇలావేల్పు అయిన శ్రీ నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణమాసం వంటి ప్రత్యేక దినాలలోనే కాకుండా నిత్యం అమ్మవారి ఆలయంకు భక్తులు తాకిడి అధికంగానే ఉంటుంది. అమ్మవారి దర్శనం కు వచ్చిన భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడం లో ఆలయ కార్యనిర్వహణాధికారి మహాలక్ష్మీనగేష్ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.