రాయ్ నగర్ కల్యాణ మండపంలో ఎస్పీ జాషువా IPS మీడియా సమావేశం నిర్వహించారు. నగదు చోరీ వారి వివరాలని తెలియజేసారు. పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్ కు చెందిన వారిగా గుర్తింపు. మొత్తం 8మందితో కూడిన ముఠా సభ్యులు దేశంలోకి ప్రవేశం. ఇటీవల ఒడిశాలో చోరీలకు పాల్పడుతుండగా ఇద్దరు అరెస్ట్, 6గురు పరారీ.
సదరు ఆరుగురు ఏపీకి చేరుకొని విజయవాడ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతుండగా గన్నవరం పోలీసులు పట్టివేత. మరో ఇద్దరిని పట్టుకోవడంలో గన్నవరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ మణింద్ర కుమార్ సేవలు అభినందనీయం అని ఎస్పీ జాషువా IPS తెలియజేసారు.