జగన్ రెడ్డి మూర్ఖత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధించడమే లక్ష్యంగా సిఐడి అధికారులు పనిచెయ్యడం దారుణం అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. వెంగళరావు అనే టీడీపీ కార్యకర్తను కొట్టారు అంటూ, అయన స్పందిస్తూ.... టిడిపి కార్యకర్త వెంగళరావు చేసిన తప్పేంటి? అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి ఆదేశాల మేరకు సిఐడి అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు.
జగన్ రెడ్డి ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ టిడిపిలో లేరు. అరెస్ట్ చేసి కొడితే ప్రశ్నించడం తగ్గుతుంది అని భ్రమపడకు జగన్ రెడ్డి. నువ్వు ఎంత తొక్కితే అంత లేస్తాం. అన్ని లెక్కలు తేలుస్తాం. వెంగళరావుని తక్షణమే విడుదల చెయ్యాలి. చట్టాలను అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై న్యాయ పోరాటం చేస్తాం అని తెలియజేసారు.