బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఇది చూసి భయంతో వారి బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పైథాన్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు అమ్మాయిల్నీ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.