విజయనగరం, గజపతినగరం: భూములు రీ సర్వేకు రైతులు సహకరించాలని గజపతినగరం తాసిల్దార్ మరడాన అరుణకుమారి కోరారు. శనివారం గజపతినగరం మండలం లోని రంగుపురం, ఎం. కొత్తవలస గ్రామాల్లో జగనన్న భూముల సర్వే కార్యక్రమాన్ని తాసిల్దార్ అరుణ కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు కర్రి లక్షణ, కుసుమకుమారి, మండల సర్వేయర్ భవాని తదితరులు పాల్గొన్నారు.