వాహనాల త్రైమాసిక పన్నులు తక్షణం చెల్లించాలని రవాణాశాఖ ఉపకమిషనర్ రాజుంత్నాం శనివారం ఒక ప్రకటనలో పెర్కొన్నారు. ఈమేరకు పన్ను చెల్లించని వాహనాల పై ప్రత్యేక డ్రైప్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వాహనాల త్రైమాసిక పన్నులు ఈ నెల 31 లోపల చెల్లించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా పన్ను జిల్లాలో పెద్ద లారీలు - 1037, కాంట్రాక్ట్ క్యారేజ్ 224, గుడ్స్ క్యారేజ్ వాహనములు -9605, ట్రైలర్ కమర్షియల్- 1085, మాక్సి క్యాబ్ - 1388, ఇతర వాహానాలు - 2069 మొత్తం 15, 408 వాహనాలకు పన్నులు చెల్లించకుండా తిరుగుతున్నాయని అన్నారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్నా వారందరికీ ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. తమ తనిఖీలలో పట్టుబడితే సదరు వాహనాన్ని సీజు చేసి 200 శాతం వరకు జరిమానా విధిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.