13వేల ప్రైవేట్ పాఠశాలల కర్ణాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశాయి ఆ రాష్ట్రంలోని 13వేల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు. ఈ మేరకు పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంఘాలు మోదీకి లేఖ రాశాయి. పాఠశాలల గుర్తింపు ధ్రువపత్రాల కోసం రాష్ట్ర విద్యాశాఖ లంచం అడుగుతోందని, విద్యాశాఖ మంత్రి నగేష్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించాయి. విద్యాశాఖ మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.