ప్రభుత్వ ఆకాంక్ష మేరకు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి అన్నారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో ఆయన శనివారం డీఎల్డీవో డివిజన్ స్థాయి అభివృద్ధి అధికారులుతో సమావేశం నిర్వహించారు. అర్హులందరికీ నవరత్నాలు అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. జడ్పీ ఉప సీఈవో ఆదిశేషారెడ్డి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం డీఎల్డీవోలు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.