ఏపీలో గోదావరి ముంపు కారణంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్ధులను పాస్ చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఆగష్టు 10న జరిగిన కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలను 270 మంది స్టూడెంట్స్ రాయలేకపోయారు. పరీక్షలు ముగిసిన తర్వాత కూడా వరదలు కొనసాగడంతో వెంటనే పరీక్ష నిర్వహించలేకపోయారు. దీంతో విద్యార్ధులను పాస్ చేయాలని నిర్ణయించారు.