చిత్తూరు నగరంలోని 10 వ డివిజన్లలో సత్యనారాయణపురం ఉషా కాలనీ ఎస్సీ కాలనీలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజును పురస్కరించుకొని శనివారం చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ వార్డులోని నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పై సమస్యలన్నీ అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో తెలియజేసి పరిష్కరించినట్లు మీడియాకు వివరించారు.