చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని పలు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో చివరి శనివారం కావడంతో స్థానిక కల్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు చేపట్టారు. ఉత్సవ విగ్రహాలను, మూల విరాట్ ను అలంకరించి పూజించారు. సింగిరిగుంట , దండుపాళ్యం మార్గాల్లోని శనీశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేపట్టి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.