పిల్లలు సరదాగా చేసే అల్లరి నవ్వు రప్పిస్తుంది. కొన్ని సార్లు ఆ సరదాలే వారి ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. అలాంటి ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వామనకుంట్లలో జరిగింది. వీరాస్వామి అనే వ్యక్తికి ఇంటికి ఇటీవల ఆయన సోదరి అరుణ వచ్చింది. అందరూ ఎవరి పనుల్లో వారుండగా, అరుణ కుమారుడు నాలుగేళ్ల విక్రమ్ బిందెలో కూర్చున్నాడు. ఇరుక్కుపోవడంతో గట్టిగా ఏడ్చాడు. బిందెను కట్టర్తో కోసి, బాలుడిని కుటుంబ సభ్యులు కాపాడారు.