వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల పై పోరాడేందుకు టిఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన విద్యా ఆగ్రహ దీక్షను అడ్డుకోవడం జగన్ రెడ్డి నియంత పరిపాలనకు నిదర్శనం అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ఆరోపించారు.
అయన మాట్లాడుతూ... వారం రోజుల ముందే అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వకపోగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలి.
అడ్డగోలు నిర్ణయాలతో విద్యా వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దాలి. జీఓ.77 రద్దు, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పునరుద్ధరణ, పాఠశాల విలీన ప్రక్రియ రద్దు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, తదితర డిమాండ్స్ ను తక్షణమే నెరవేర్చాలి అని డిమాండ్ చేసారు.