రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం మైనారిటీ వడ్డెర రజక నాయిబ్రాహ్మణ తదితర కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కే దక్కిందని సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ యనమల సుబ్రహ్మణ్యం అన్నారు. నిన్న రాత్రి సుళ్లూరుపేట లోని బాలాజీ కాలనీలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడు రమేష్ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డితో కలిసి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి పెరిగిన నిత్యావసరాల పై ప్రజలకు అవగాహన కల్పించారు. వైకాపా అరాచకాలు నుంచి ప్రజలు బయటపడాలంటే త్వరలోనే ఈ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అజయ్ కిషోర్ సాయి పెంచలయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.