ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. దేశ రాజధాని సుమత్రాకు పశ్చిమంగా ఉండే పరియమాన్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూమికి 11.9 కి.మీ.లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు తెలిపారు. దీని వల్ల ఎంత నష్టం ఏర్పడిందనే విషయంపై స్పష్టత లేదన్నారు. అయితే సునామీ వచ్చే ప్రమాదాలు లేవన్నారు.