కులమతాల కుంపటి రాజెయ్యాలనుకుంటే జనం మిమ్మల్ని అసహ్యించుకుంటారు. ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా ఉంటే మీకెందుకు కంటగింపు? అంటూ విజయసాయిరెడ్డి సోమవారం ట్వీట్ చేశారు.
విఘ్నాలను తొలగించే వినాయకుడి మండపాలు, పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
దుర్మార్గమైన ప్రతిపక్షాలు దేవుడితో ఆడుకుంటున్నాయి. అహంకారంతో కళ్లు మూసుకుపోయి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎక్కడా ఏరకమైన రుసుము వసూలు చేయమని చెప్పలేదు. మైక్ పర్మిషన్ గతం నుంచి కొనసాగుతోంది. డీఎస్పీ పర్మిషన్ ఇస్తారు. డీఎస్పీ దగ్గరకు వెళ్లాలంటే దూరభారం అవుతుందని దగ్గరలో ఉన్న సర్కిల్ ఇనిస్పెక్టర్ వద్ద అప్లయ్ చేస్తే ఆన్‌లైన్‌లో డీఎస్పీకి పంపించి అప్రూవల్ ఇచ్చేస్తారు. ఇంతకు మించి ఏరకమైన ఆదేశాలు ఇవ్వలేదు అని వైసీపీ నాయకులూ, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేసారు.