ముంబైలో దారుణ హత్య జరిగింది. పొవార్ ప్రాంతానికి చెందిన మహిళ జోహ్రా షా(30)కు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు ఆరుగురు పిల్లలు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ రంజాన్ షేక్(26)తో ఆమె ప్రేమలో పడింది. శనివారం ఇద్దరూ ఆటోలో వెళ్తుండగా ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దానికి ఒప్పుకోలేదని ప్రియుడిని తన చున్నీతో గొంతు నులిమి చంపింది. నిందితురాలిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.