రాజాం నియోజకవర్గం లోని రాజాం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి , వంగర మండలంలో ఇటుకల తయారీదారులు నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. కనీసం అనుమతులు కూడా తీసుకోకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు మండలాల్లో అనధికారికంగా దాదాపు 200 వరకు బట్టీలు ఉన్నాయని సమాచారం. వీటిలో ఒక్క రేగిడి ఆమదాలవలస మండలం లో లచ్చ రాయి పురం, గొల్లపాడు, లచ్చన్న వలస, బూరాడ, సిర్లం లో దాదాపు వంద ఇటుక బట్టీలు వరకు ఉన్నాయి. ఇటీవల లచ్చరాయిపురం, గుల్లపాడు ప్రధాన రహదారికి ఆనించి పదుల సంఖ్యలో బట్టీలు ఒక్కసారిగా వెలిసాయి. రాజాం మండలం లోని గార్రాజుచీపురుపల్లి సమీపంలో వంగర మండలం లోని అరసాడ సంఘం, సంతకవిటి మండలం లోని మల్లయ్య పేట లో అనధికారికంగా బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతి లేని బట్టీల పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.