డుంబ్రిగుడ మండలంలోని ఖండ్రుం పంచాయతీ గోంగూడ లో ఆదివారం పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా పిడుగుపాటుకు గురై గోంగుడా గ్రామానికి చెందిన కిలో సూరి ( 10) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారి కుటుంబీకులు అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు బాలుడు వారి తల్లిదండ్రులతో కలిసి గ్రామ సమీపంలో గల పొలం పనుల్లో కలిసి వెళ్ళాడు.
ఆ సమయంలో పిడుగు శబ్దలతో వర్షం కురవడంతో పొలానికి సమీపంలో గల మామిడి చెట్టు కింద వెళ్లి నిలబడ్డారు. ఆ సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైనట్లు అ గ్రామస్తులు తెలిపారు. వైద్య సేవల నిమిత్తం హుటాహుటిన ఆ గ్రామస్తులు వారిని 108 అంబులెన్స్ సహాయంతో అరకులోయ ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. బాలుడు మృతి చెందడంతో పాటు గాయాలైన ముగ్గురంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.