చిత్తూరు, తంబళ్లపల్లె: బి. కొత్తకోట లో ఇటీవల జరిగిన ప్రమాదంలో కన్ను కోల్పోయిన బాధితునికి బి. కొత్తకోట ఎస్ఐ రామ్మోహన్ రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని ఆదివారం అందజేశారు. గత వారం రోజుల క్రితం బి. కొత్తకోటలో జరిగి ప్రమాదంలో ఆటోపైన ఉన్న రాడ్డు పొడుచుకొని బాధితుడు కన్ను కోల్పోయాడు. ఈ ఘటనపై స్పందించిన బి. కొత్తకోట ఎస్ఐ రామ్మోహన్ బాధితుడికి ఆర్థిక సహాయాన్ని అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.