చిత్తూరు, పలమనేరు: నియోజకవర్గంలో పెద్దపంజాణిలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలని ఎస్ఐ స్వర్ణ తేజ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందస్తుగా విగ్రహాలను ఏర్పాటు చేసుకునేవారు తప్పకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శబ్ద కాలుష్యం చేయరాదన్నారు. ట్రాఫిక్ అంతరాయం గా విగ్రహాలు ఉంచ రాదన్నారు.