సెప్టెంబరు 3న తిరువనంతపురంలో జరుగనున్న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి ఏపీ సీఎం జగన్ గైర్హాజరు కానున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి నేపథ్యంలో ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో టీం ఈ సమావేశానికి హాజరుకానుంది. విభజన సమస్యలు, కేంద్ర హామీల అమలుకు గట్టిగా డిమాండ్ చేయాలని సీఎం జగన్ తెలిపారు