ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఎఫ్సీఐ' లో ఉద్యోగాల భర్తీ

national |  Suryaa Desk  | Published : Mon, Aug 29, 2022, 11:26 PM

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ జోన్‌లలో మేనేజర్ (జనరల్/ డిపో/ మూవ్‌మెంట్/ అకౌంట్స్/ టెక్నికల్/ సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి] రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టనుంది.
అర్హత ఉన్నఅభ్యర్థులు
అధికారిక వెబ్‌సైట్ fci.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 26, 2022న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎఫ్‌సీఐ మొత్తంగా 113 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
* ఎఫ్‌సీఐ రిక్రూట్‌మెంట్-2022: ముఖ్యమైన తేదీలు
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ- సెప్టెంబర్-26, 2022
* ఖాళీల వివరాలునార్త్ జోన్- 35 పోస్టులు
సౌత్ జోన్- 16 పోస్టులు
వెస్ట్ జోన్- 20 పోస్టులు
ఈస్ట్ జోన్- 21 పోస్టులు
నార్త్ ఈస్ట్ జోన్- 18 పోస్టులు
* ఎఫ్‌సీఐ రిక్రూట్‌మెంట్- అర్హత ప్రమాణాలు

మేనేజర్ (జనరల్): కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్ చేసి ఉండాలి. ఇక ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
ఉద్యోగాలు ... పూర్తి వివరాలివే">
మేనేజర్ (డిపో): కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్ చేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉంటే ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* ఎంపిక ప్రక్రియ
మేనేజర్ (జనరల్/ డిపో/ మూవ్‌మెంట్/ అకౌంట్స్/ టెక్నికల్/ సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్) పోస్టుల కోసం అభ్యర్థులకు ముందుగా ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆపై ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
మేనేజర్ (హిందీ) పోస్టులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది.
* దరఖాస్తు విధానం
స్టెప్-1:ఎఫ్‌సీఐ అధికారిక వెబ్‌సైట్ https://fci.gov.in/ ను సందర్శించండి.
స్టెప్-2:రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలను నమోదు చేయండి.
స్టెప్-3: రిజిస్ర్టేషన్ సక్సెస్ అయిన తరువాత తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. భవిష్యత్ అవసరాల కోసం అభ్యర్థులు ఈ వివరాలను సేవ్ చేసుకోవాలి.
స్టెప్-3: నోటిఫికేషన్‌లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం.. స్కాన్ చేసిన ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
స్టెప్-4: ఆ తరువాత ఎడ్యుకేషన్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్-5: చివరిగా దరఖాస్తును సబ్‌మిట్ చేసే ముందు, మొత్తం అప్లికేషన్‌ను ప్రివ్యూ చేయడానికి, ధృవీకరించడానికి ప్రివ్యూ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-6: వెరిఫై చేసిన తరువాత ఫైనల్‌గా సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-7: ఆ తరువాత ఫీజు పేమెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-8: ఫీజు పేమెంట్ పూర్తయితే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఈమేరకు అభ్యర్థుల ఇమెయిల్ ఐడీ/ఫోన్ నంబర్‌కు మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది.
* దరఖాస్తు రుసుము
జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://fci.gov.in/ ను సందర్శించాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com