పాతఇంటిని కూలగొడుతుండగా కూలీలకు బంగారు నాణేలుతో కూడిన నిధి దొరికింది. ఇంటి యజమానికి తెలియకుండా వాటిని 8మంది కూలీలు పంచుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, తాగిన మైకంలో ఓ కూలీ నాణేలు దొరికాయని నోరు జారడంతో విషయం బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని ధర్‌లో ఘటన జరగగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న నాణేల విలువ సుమారు రూ.1.25కోట్లు ఉంటుందని పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa